పరిపాలన అంటే అప్పులు చేయడం కాదు, గిఫ్టులు ఇవ్వడం కాదు..సోము వీర్రాజు

విధాత :రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై పెద్ద దుమారం లేచిందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు పరిపాలన రాదని విమర్శించారు. విశాఖలో.. తహసీల్దారు కార్యాలయాలు, సర్క్యూట్ హౌస్ అమ్మేద్దామని చూస్తున్నారని..ఉపేక్షిస్తే భాజపా నేత విష్ణుకుమార్ రాజు ఇంటినీ అమ్మకానికి పెడతారేమోనని ఎద్దేవా చేశారు.అశోక్‌ గజపతిరాజును ఉద్దేశించి విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను సోము వీర్రాజు ఖండించారు.వ్యవసాయ రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వట్లేదని ఆరోపణలు చేశారు.విశాఖ భూముల వ్యవహారంలో హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ […]

  • Publish Date - June 22, 2021 / 04:03 PM IST

విధాత :రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై పెద్ద దుమారం లేచిందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు పరిపాలన రాదని విమర్శించారు. విశాఖలో.. తహసీల్దారు కార్యాలయాలు, సర్క్యూట్ హౌస్ అమ్మేద్దామని చూస్తున్నారని..ఉపేక్షిస్తే భాజపా నేత విష్ణుకుమార్ రాజు ఇంటినీ అమ్మకానికి పెడతారేమోనని ఎద్దేవా చేశారు.అశోక్‌ గజపతిరాజును ఉద్దేశించి విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను సోము వీర్రాజు ఖండించారు.వ్యవసాయ రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వట్లేదని ఆరోపణలు చేశారు.విశాఖ భూముల వ్యవహారంలో హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.