ఆనందయ్య మందుపై అన్ని పరీక్షలు, నివేదికలు రేపు సాయంత్రం వెల్లడి

వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జిల్లా అధికార యంత్రాంగం మంచి మనస్సు చేసుకుని ఆ వెంటనే మందు పంపిణీ పున:ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నా..నెల్లూరు మీడియాతో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కృష్ణపట్నం ఆనందయ్య తయారుచేస్తున్న ఆయుర్వేదం మందుతో సైడ్ ఎఫెక్ట్స్ లేవని ఆయుష్ కమిషనర్ ప్రకటించడం శుభపరిణామం..ఆయుర్వేదం మందుగా కాకపోయినా నాటు మందుగా అయినా ఫలితాన్నిస్తోందని కూడా ఆయన ప్రకటించారు..అయినా కూడా సీసీఆర్ఏఎస్ కు శాంపిల్స్ పంపాలని, మందు అందుబాటులోకి వచ్చేసరికి మరో వారం, పది […]

  • Publish Date - May 23, 2021 / 12:40 PM IST

వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జిల్లా అధికార యంత్రాంగం మంచి మనస్సు చేసుకుని ఆ వెంటనే మందు పంపిణీ పున:ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నా..నెల్లూరు మీడియాతో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

కృష్ణపట్నం ఆనందయ్య తయారుచేస్తున్న ఆయుర్వేదం మందుతో సైడ్ ఎఫెక్ట్స్ లేవని ఆయుష్ కమిషనర్ ప్రకటించడం శుభపరిణామం..ఆయుర్వేదం మందుగా కాకపోయినా నాటు మందుగా అయినా ఫలితాన్నిస్తోందని కూడా ఆయన ప్రకటించారు..అయినా కూడా సీసీఆర్ఏఎస్ కు శాంపిల్స్ పంపాలని, మందు అందుబాటులోకి వచ్చేసరికి మరో వారం, పది రోజులు పడుతుందని ఈ రోజు సాక్షి పత్రిక మొదటిలో పేజీలో రాశారు..

సాఫీగా సాగిపోతున్న కార్యక్రమాన్ని ఆపి వారం అయింది…ఇప్పుడు మళ్లీ మరో పది రోజులంటున్నారు..అంటే సెకండ్ వేవ్ పోయి థర్డ్ వేవ్ వచ్చే వరకు ఆ మందు పంపిణీ ఆపేయడం న్యాయమా..మందు పంపిణీని కొనసాగించాలని ఓ ప్రబుద్ధుడు చెప్పాడంటూ ఇందాకే సర్వేపల్లి ఎమ్మెల్యే విమర్శలు చేశారు..శాస్త్రీయత, అనుమతి లేకుండా మందు ఎలా పంపిణీ చేస్తామని కూడా ఆయన సెలవిచ్చారు..

అనుమతి రావడానికి వారం, పది రోజులు పడుతుందని తెలిసిన పెద్దమనిషికి, నన్ను ప్రబుధ్ధుడని వ్యంగ్యంగా కీర్తించిన మహానుభావుడు 21వ తేదీన మందు పంపిణీకి అనుమతి రాకుండానే కృఫ్ణపట్నం వెళ్లి గందరగోళానికి ఎందుకు కారణమయ్యారు..

కలెక్టర్ పంపిన రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ, ఆయుష్ బృందమే 17వ తేదీ కృఫ్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీని ఆపింది..అయితే అనుమతి రాకుండానే మందు పంపిణీ చేయబోతున్నామని 20వ తేదీ ప్రకటన ఇచ్చి విస్త్రృత ప్రచారం చేసింది ఎవరు..21వ తేదీ రాష్ట్ర నలుమూలల నుంచి 30, 40 వేల మంది ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని అంబులెన్సులు, ఇతర వాహనాల్లో కృష్ణపట్నం రావడానికి కారణమెవరు.

ప్రారంభించి వెళ్లగానే గందరగోళం ఏర్పడి చివరకు ఆనందయ్య తాను మందు ఉంచిన గదికి తాళం వేసి ఆర్డీఓకి అప్పగించి వెళ్లిపోయిన పరిస్థితి తెచ్చింది ఎవరు,చిన్నచిన్న ఉల్లంఘనలు జరిగితేనే కేసులు పెడుతున్నారు.. సామాన్యులు మాస్కులు పెట్టుకోకపోతే లోపల వేస్తున్నారు…

కృష్ణపట్నంలో ఆ రోజు చోటుచేసుకున్న అల్లకల్లోల పరిస్థితికి కారణం మీరు కాదా…

కృష్ణపట్నంలో కోవిడ్ నిబంధనలు పాటించలేని పరిస్థితి రావడానికి కారణం ఎవరు..మీరు కాదా,అనుమతి రాకుండానే ప్రారంభిస్తున్నామని ఒక బాధ్యత కలిగిన ఎమ్మెల్యేగా మీరు ఎలా ప్రకటన ఇస్తారు.మా సీఎం అధికారుల బృందాన్ని పంపిస్తున్నారు..అనుమతులు వచ్చాకే మందు పంపిణీ ప్రారంభిస్తామని ఈ రోజు మీరే చెప్పారు..

ఆ రోజు ఇవన్నీ లేకుండానే ప్రకటనలిచ్చి మరీ ప్రారంభించి గందరగోళానికి కారణమయిన మీకు బాధ్యత లేదా..మీరు బాధ్యత లేకుండా వ్యవహరించి ఈ రోజు నా గురించి మాట్లాడుతారా..ఆ రోజు కృష్ణపట్నంలో ఆ పరిస్థితి తలెత్తడానికి కారణం నేనా..

ఐసీఎంఆర్, ఆయుష్ బృందాలు త్వరితగతిన పరిశీలన పూర్తి చేసి నివేదిక ఇచ్చి మందు పంపిణీకి ఆటంకాలు తొలగించాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఇప్పటికే సూచించారు..

రేపు ఐసీఎంఆర్ బృందం కూడా కృష్ణపట్నం రాబోతోంది..అన్ని పరిశీలనలు పూర్తి చేసి రేపు సాయంత్రానికి అనుమతులు మంజూరు చేయండి.కంటిలో వేసే మందుపై ఇప్పటివరకు కొన్ని అనుమానాలున్నాయి…వాటిని కూడా ఆయుష్ కమిషనర్ నివృత్తి చేశారు…

ఆ మందుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని స్పష్టం చేశారు..

ఆనందయ్య నమూనాను రాష్ట్రమంతా షేర్ చేసి కృష్ణపట్నంపై ఒత్తిడి తగ్గిస్తామని కూడా కమిషనర్ చెబుతున్నారు..అది కూడా ఆనందయ్య అనుమతితోనే చేయాల్సివుంటుంది..ఆయుష్ అధికారులు ఇంత క్లారిటీకి వచ్చాక కూడా ఇంకా వారం, పది రోజులు పంపిణీ ఆపుతామనడం న్యాయం కాదు..

మందు తయారీకి అవసరమైన వనమూలికలను నెలరోజులకు సరిపడా ఆనందయ్యకు సమకూర్చేందుకు ఈ రోజు మా మిత్రులు ముందుకొచ్చారు.అదే విధంగా అనేక మంది ముందుకొచ్చి ప్రజల ప్రాణాలు కాపాడమని వేడుకుంటున్నారు..బాధ్యత లేని ఎమ్మెల్యే మాటలు పట్టించుకోనవసరం లేదు..ఆయన మాటల తీరే అంత..

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నాది ఒకటే విజ్ఞప్తి…

దయచేసి…దయచేసి ఐసీఎంఆర్, ఆయుష్ తదితర అన్ని పరీక్షలు, నివేదికలు సోమవారం సాయంత్రానికి పూర్తి చేయించండి..ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం మంచి మనస్సు చేసుకుని ఆనందయ్య మందు పంపిణీని ఆ వెంటనే కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పున:ప్రారంభించి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నా…