Ambati Rambabu Bhogi dance| భోగి వేడుకల్లో మాజీ మంతి అంబటి డాన్స్ వైరల్

ఏపీలో సంక్రాంతి సంబరాలు అధికార టీడీపీ కూటమికి, ప్రతిపక్షవైసీపీ పార్టీకి మధ్య రాజకీయ ఆధిపత్య క్రీడకు వేదికగా మారాయి. ముఖ్యంగా చంద్రబాబు సర్కార్‌ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ కోసం తెచ్చిన జీవో ప్రతులను వైసీపీ శ్రేణులు భోగి మంటల్లో దహనం చేసి వినూత్న నిరసన వ్యక్తం చేయగా..కౌంటర్ గా టీడీపీ శ్రేణులు మాజీ సీఎం జగన్ సర్కార్ హయాంలోని పట్టాదార్ పాస్ పుస్తకాల ప్రతులను భోగి మంటల్లో దహనం చేశాయి. ఇదంతా ఒకటైతే..వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు భోగి మంటల వేడుకల్లో చేసిన డాన్స్ ఒక ఎత్తుగా అందరిని ఆకట్టుకుంది.

విధాత : ఏపీలో సంక్రాంతి సంబరాలు అధికార టీడీపీ కూటమికి, ప్రతిపక్షవైసీపీ పార్టీకి మధ్య రాజకీయ ఆధిపత్య క్రీడకు వేదికగా మారాయి. కోడి పందాలు, ఎడ్ల పందాలు, పడవ పోటీలు మొదలుకుని..భోగి మంటల వేడుకల వరకు కూడా ఇరుపక్షాలు పండుగ సంబరాలలో రాజకీయాలు జోప్పిస్తూ రక్తి కట్టిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు సర్కార్‌ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ కోసం తెచ్చిన జీవో ప్రతులను వైసీపీ శ్రేణులు భోగి మంటల్లో దహనం చేసి వినూత్న నిరసన వ్యక్తం చేయగా..కౌంటర్ గా టీడీపీ శ్రేణులు మాజీ సీఎం జగన్ సర్కార్ హయాంలోని పట్టాదార్ పాస్ పుస్తకాల ప్రతులను భోగి మంటల్లో దహనం చేశాయి.

ఇదంతా ఒకటైతే..వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు భోగి మంటల వేడుకల్లో చేసిన డాన్స్ ఒక ఎత్తుగా అందరిని ఆకట్టుకుంది. తనను రాజకీయ ప్రత్యర్థులు సంబరాల రాంబాబు అంటు చేసే విమర్శలను గుర్తు చేసుకున్న అంబటి రాంబాబు నేను ఎక్కడుంటే.. అక్కడే సంబురాలు అంటూ భోగి వేడుకల్లో చంద్రాబాబు టార్గెట్ గా బాణి కట్టిన పాటకు తనదైన శైలిలో డాన్స్ స్టెప్పులతో అదరగొట్టారు. వింటున్నావా చంద్రబాబు అంటూ సాగిన పాటకు అంబటి డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేస్తున్నానని..అందుకే ఇక్కడ సంక్రాంతి సంబురాలు చేస్తాను..డ్యాన్సులు చేస్తాననని ఈ సందర్భంగా అంబటి రాంబాబు స్పష్టం చేశారు. తనను విమర్శించేవాళ్లు ఆ పని చేయలేరు అని..ఎందుకంటే నేను పొలిటీషియన్‌ను.. వాళ్లు కాదు కాబట్టి’’ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై అంబటి సెటైర్లు వేశారు.

 

Latest News