గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఆరుగురి ముఠా అరెస్టు

సుమారు 29 KG ల గంజాయి, 6 సెల్ ఫోన్లు, కారు స్వాధీనం విశాఖ జిల్లాలో తక్కువ ధరకు కొనుగోలు చేసి అనంతపురంలో అధిక ధరలకు విక్రయించే యత్నం విధాత‌,అనంతపురం:గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఆరుగురి ముఠాను అనంతపురం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 29 KG ల 100 గ్రాముల గంజాయి, 6 సెల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం జిల్లాలో తక్కువ ధరకు కొనుగోలు చేసి అనంతపురంలో అధిక ధరలకు విక్రయించే […]

  • Publish Date - June 18, 2021 / 04:52 AM IST
  • సుమారు 29 KG ల గంజాయి, 6 సెల్ ఫోన్లు, కారు స్వాధీనం
  • విశాఖ జిల్లాలో తక్కువ ధరకు కొనుగోలు చేసి అనంతపురంలో అధిక ధరలకు విక్రయించే యత్నం

విధాత‌,అనంతపురం:గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఆరుగురి ముఠాను అనంతపురం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 29 KG ల 100 గ్రాముల గంజాయి, 6 సెల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం జిల్లాలో తక్కువ ధరకు కొనుగోలు చేసి అనంతపురంలో అధిక ధరలకు విక్రయించే యత్నం చేసి పోలీసులకు చిక్కారు. జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS గారి ఆదేశాల మేరకు అనంతపురం డీఎస్పీ జి.వీరరాఘవరెడ్డి పర్యవేక్షణలో పట్టుబడిన ఈ ముఠా అక్రమ వ్యవహారం గురించి రూరల్ సి.ఐ మురళీధర్ రెడ్డి వివరాలు వెల్లడించారు.
విశాఖపట్నం జిల్లా హుకుంపేట ప్రాంతంలో రూ. 1.10 లక్షలు వెచ్చించి సుమారు 29 కిలోల 100 గ్రాముల గంజాయిని పవన్ కుమార్ , అఖిల్ , వెంకట రవితేజ , నాగరాజులు కొనుగోలు చేశారు. కారులో వెళ్లిన నలుగురిలో పవన్ కుమార్ , అఖిల్ లు గంజాయిని రైలులో తీసుకొచ్చారు. మిగితా ఇద్దరు కారులో తిరిగి అనంతపురం చేరుకున్నారు. వీరంతా కలసి ఈరోజు గంజాయిని కారులో అక్రమంగా తరలించసాగారు. స్థానిక రాచానపల్లి గ్రామంలో డంప్ చేసి అధిక ధరలకు విక్రయించాలని భావించారు. కిలో రూ. 15 వేల ప్రకారం అమ్మాలని భావించి ఇద్దరు కొనుగోలుదారులను వెంటతీసుకెళ్తున్న ఈ ముఠాను జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS గారి ఆదేశాల మేరకు డీఎస్పీ జి. వీర రాఘవ రెడ్డి పర్యవేక్షణలో … అనంతపురం రూరల్ సి.ఐ మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై బి.నబీరసూల్, ఎ.యస్.ఐ. కె. మోహన్ బాబు, హెడ్ కానిస్టేబుల్ ఎం. వెంకటేశులు, కానిస్టేబుళ్లు నరేశ్ బాబు, బి.జయకర్, బి.ఉమా శంకర్, బి. రాజేశ్వర్ రెడ్డి, బి.రామ్మోహన్, జి. నవీన్ కుమార్ బృందంగా ఏర్పడి స్థానిక బళ్ళారి రోడ్ లోని MYR Function hall వద్ద ముఠాను అరెస్టు చేశారు.

అరెస్టయిన ముఠా సభ్యుల వివరాలు:

1) కుంచెపు వడ్డే పవన్ కుమార్, వయస్సు 23 సం. లు, రెవెన్యూ కాలనీ, అనంతపురం
2) అఖిల్, వయస్సు 24 సం., బళ్ళారి రోడ్, అనంతపురం
3)పి.వెంకట రవి తేజ, వయస్సు 29 సం.లు కొవ్వూరు మండల కేంద్రం, పశ్చిమ గోదావరి జిల్లా
4) నాగరాజు, వయస్సు 23 సం. లు కౌల్ బజార్, బళ్ళారి నగరం, కర్నాటక
5) పూల సునీల్ కుమార్, వయస్సు 21 సం.లు, రాణి నగర్ , అనంతపురం
6) B.ధన్ రాజ్, వయస్సు 20 సం., తపోవనం,
అనంతపురం