అమరావతి:యస్.విష్ణువర్ధన్ రెడ్డి బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి తెలంగాణ ప్రభుత్వం పై మండిపడ్డారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ఏపీకి, ప్రత్యేకంగా రాయలసీమకు అన్యాయం చేయాలనుకోవడం సిగ్గుచేటు.కరువులో ఉన్న సీమ రైతులు సముద్రంలోకి వెళ్ళేనీటిని వాడుకోంటే అడ్డుకోవాలని
తెలంగాణ కేబినెట్ లో చర్చించడం భాద్యతారాహిత్యం.విభజన సమయంలో ప్రాంతాలుగా విడిపోదాం – ప్రజలందరం అన్నదమ్మలుగా ఉందాం అంటే ఇదేనా?
శ్రీశైలంలో వేల ఏకరాలు ఇచ్చి మా భూములు కోల్పోయి, ముంపు మాకు- నీళ్ళు తెలంగాణకు ఇస్తున్నాం. మేము కూడ మా భూవిు,మా నీళ్ళు అంటే మీరు ఓప్పుకుంటారా?.ఏపి ముఖ్యమంత్రి జగన్ గారు మీరు తెలంగాణ కేబినెట్ వ్యాఖలపై ఏందుకు స్పందించరు? మీ రెండు పార్టీల మధ్య సంబంధాల కోసంఆంద్రరాష్ట్ర ప్రయోజనాలను బలి చేస్తారా?
రాయలసీమ ఎంపీలు & ఎమ్మెల్యేలు మీ తెలంగాణాలలో వ్యాపారాలకోసం సీమ ప్రజల ప్రయోజనాలను తాకట్టుపెడతారా?
కేసీఆర్ గారు రాయలసీమ నీటి పథకాలు, రాజోలిబండ (ఆర్డిఎస్) అక్రమ ప్రాజెక్టులని ఆరోపణలు చేస్తుంటే, తెలంగాణ అక్రమ ప్రాజెక్ట్ పై మాట్లాడరెందుకు.
Readmore:రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద TRS ప్రభుత్వం అభ్యంతరం చెప్పడం సహేతుకం కాదు