రెండున్నర గంటలు గా కొనసాగుతున్న ఏపీ క్యాబినెట్

విధాత‌: ఆగస్టు లో అమలు చేయనున్న నవరత్నాల పథకాలతో పాటు పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు.జగనన్న విద్యాకానుక, నాడు-నేడు, శాటిలైట్‌ ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లు, ప్రీ హైస్కూళ్లు, హైస్కూళ్లు, హైస్కూల్‌ ప్లస్ ఏర్పాటుపై కేబినెట్‌లో చర్చ. ఈ నెల 10న అమలు చేయనున్న 'వైఎస్ఆర్‌ నేతన్న నేస్తం' పథకంపై చర్చ. పోలవరం నిర్వాసితుల ఆర్‌అండ్ఆర్‌ చెల్లింపులను కేబినెట్‌ ఆమోదించనుంది. రూ.10లక్షల పరిహారం చెల్లింపునకు రూ.550 కోట్ల విడుదల,అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపులు, […]

  • Publish Date - August 6, 2021 / 08:42 AM IST

విధాత‌: ఆగస్టు లో అమలు చేయనున్న నవరత్నాల పథకాలతో పాటు పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు.జగనన్న విద్యాకానుక, నాడు-నేడు, శాటిలైట్‌ ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లు, ప్రీ హైస్కూళ్లు, హైస్కూళ్లు, హైస్కూల్‌ ప్లస్ ఏర్పాటుపై కేబినెట్‌లో చర్చ. ఈ నెల 10న అమలు చేయనున్న ‘వైఎస్ఆర్‌ నేతన్న నేస్తం’ పథకంపై చర్చ.

పోలవరం నిర్వాసితుల ఆర్‌అండ్ఆర్‌ చెల్లింపులను కేబినెట్‌ ఆమోదించనుంది. రూ.10లక్షల పరిహారం చెల్లింపునకు రూ.550 కోట్ల విడుదల,అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపులు, క్లీన్ ఆంధ్రప్రదేశ్, జగనన్న స్వచ్ఛ సంకల్పానికి కేబినెట్ ఆమోదం.

ధార్మిక పరిషత్ కార్యనిర్వాహక కమిటీ ఏర్పాటుపై చట్ట సవరణకు ఆమోదం తెలపనున్న కేబినెట్ ఆమోదం తెలపనుంది. రైతుభరోసా కేంద్రాల ద్వారా విత్తనోత్పత్తి పాలసీని కేబినెట్ఆమోదించనుంది.మచిలీపట్నం, భావనపాడు పోర్టుల రివైజ్డ్‌ అంచనాలను ఆమోదించనున్న కేబినెట్.

బుడగట్లపాలెం, పూడిమడక, ఓడలేరు, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి మంత్రి వర్గం ఆమోదం,లోకాయుక్త కర్నూల్‌కు తరలించే ప్రతిపాదనకు, హెచ్‌ఆర్‌సీ కార్యాలయం కర్నూలులో ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.