విధాత:రాయలసీమ lift irrigation scheme మీద TRS ప్రభుత్వం అభ్యంతరం చెప్పడం సహేతుకం కాదనికృష్ణా సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ వైఖరి విడ్డూరమన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు డా. తులసిరెడ్డి.
ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక వైపు నీటికేటాయింపులు లేకుండా సీడబ్ల్యుసీ, కేఆర్ఎంబీ అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా కృష్ణానదిపై 179 టీఎంసీల సామర్ధంతో 8 సాగునీటి ప్రాజెక్టులు అక్రమంగా నిర్మిస్తున్నదని అవి 1)పాలమూరు..రంగారెడ్డి 2)డిండి 3)మిషన్ భగీరధ 4)భక్త రామదాసు 5)తుమెళ్ల 6)నెట్టెంపాడు సామర్ధం పెంచడం 7)ఎస్ఎల్బీసీ సామర్ధం పెంచడం 8)కల్వకుర్తి సామర్ధం పెంచడం.
దిగువ రాష్ట్ర మైన ఆంధ్ర ప్రదేశ్,ఎగువ రాష్ట్ర మైన తెలంగాణకు నష్టం చేస్తుందనడం హాస్యాస్పదం
రాయల సీమ ఎత్తిపోతల పథకం క్రింద కొత్త ఆయకట్టు లేదు
ఇవికాక 4 అక్రమ ప్రాజెక్టులకు ప్రతిపాదనలు..అవి..పులిచింతల ఎడమ కాల్వ, సుంకేసుల ఎత్తిపోతల, నాగార్జునసాగర్ టెయిల్ పాండు ఎత్తిపోతల, జోగులాంబ బ్యారేజ్..
త్యాగసీమ,ఆకలిసీమ అయిన రాయలసీమకు అన్యాయం చేయవద్దని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
Readmore:అమరావతి ఉద్యమం 550వ రోజుకు చేరుకుంది.