చనిపోయిన రైతుల కుటుంబాలకు ఏపీకాంగ్రెస్ ఆధ్వర్యంలో మౌనదీక్ష

విధాత‌: శాంతియుతంగా మార్గంలో నిరసన తెలియజేస్తూ వెళుతున్న రైతులను వాహణంతో ఢీ కొట్టి మృత్యువాతకు గురిచేసిన కేంద్ర మంత్రి ఈ సమాజంలో జీవించే హక్కులేదని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ శ్రేణులు తెలియజేసారు.ఏఐసీసీ ఆదేశాలమేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మరియు విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు విజయవాడ అల్ ఇండియా రేడియో కేంద్రం వద్ద తమ నిరసనని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీజేపీ మంత్రి కుమారుడిని మోడీ ప్రభుత్వం అరెస్టు చేయలేదు […]

  • Publish Date - October 11, 2021 / 11:30 AM IST

విధాత‌: శాంతియుతంగా మార్గంలో నిరసన తెలియజేస్తూ వెళుతున్న రైతులను వాహణంతో ఢీ కొట్టి మృత్యువాతకు గురిచేసిన కేంద్ర మంత్రి ఈ సమాజంలో జీవించే హక్కులేదని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ శ్రేణులు తెలియజేసారు.ఏఐసీసీ ఆదేశాలమేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మరియు విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు విజయవాడ అల్ ఇండియా రేడియో కేంద్రం వద్ద తమ నిరసనని వ్యక్తపరిచారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీజేపీ మంత్రి కుమారుడిని మోడీ ప్రభుత్వం అరెస్టు చేయలేదు కానీ, చనిపోయిన కుటుంబాలను ఆదుకోవడానికి, పరామర్శించడానికి ముందుకొచ్చిన ప్రియాంక గాంధీ అక్రమ అరెస్టు చేయడం సమంజసమా అని నాయకులు ప్రశ్నించారు. రైతులను పురుగుల్లా చూస్తూన్న మోడీ ప్రభుత్వాన్ని ప్రజలు చీడ పురుగులా చూస్తున్నారని ఆ సంఘటనలో చనిపోయిన మృతులకు నివాళులు అర్పిస్తూ, నిందితుడిని కఠినంగా శిక్షించాలని మౌన దీక్ష నిర్వహిస్తున్నామని నాయకులు తెలియజేసారు. అలాగే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్రమంతట కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఈ మౌన దీక్షలు నిర్వహించడం జరిగిందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ ఇంచార్జి పరస రాజీవ్ రతన్, విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరహారశెట్టి నరసింహారావు, ఏపీసీసీ ఆర్టీఐ చైర్మన్ పివై కిరణ్ కుమార్, హ్యూమన్ రైట్స్ సెల్ ఛైర్మన్ మన్నం రాజశేఖర్, మరియు విజయవాడ నగర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,పాల్గొన్నారు.