ఒప్పంద ఉద్యోగులకు మినిమం పే స్కేల్‌

అమరావతి: ఒప్పంద ఉద్యోగులకు మినిమం పే స్కేల్‌ అమల్లో ఏకరూప్యతకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ శాఖలు, వర్సిటీలు, సొసైటీలు, కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లలో పనిచేసే ఉద్యోగులకు వర్తింపజేయనుంది. ఒప్పంద ఉద్యోగులకు ఇతర అలవెన్సులు వర్తించవని ప్రభుత్వం పేర్కొంది. కన్సల్టెంట్లు, సలహాదారులు, ఓఎస్డీలకు పే స్కేల్‌ నిబంధనలు వర్తించవని వెల్లడించింది. ఒప్పంద మహిళా ఉద్యోగులకు 180 రోజుల మెటర్నిటీ లీవ్‌ను వర్తింపజేసింది. ప్రమాదంలో మరణించిన ఒప్పంద ఉద్యోగి కుటుంబానికి రూ.5 లక్షలు, సహజంగా మరణిస్తే […]

  • Publish Date - June 19, 2021 / 07:20 AM IST

అమరావతి: ఒప్పంద ఉద్యోగులకు మినిమం పే స్కేల్‌ అమల్లో ఏకరూప్యతకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ శాఖలు, వర్సిటీలు, సొసైటీలు, కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లలో పనిచేసే ఉద్యోగులకు వర్తింపజేయనుంది. ఒప్పంద ఉద్యోగులకు ఇతర అలవెన్సులు వర్తించవని ప్రభుత్వం పేర్కొంది. కన్సల్టెంట్లు, సలహాదారులు, ఓఎస్డీలకు పే స్కేల్‌ నిబంధనలు వర్తించవని వెల్లడించింది. ఒప్పంద మహిళా ఉద్యోగులకు 180 రోజుల మెటర్నిటీ లీవ్‌ను వర్తింపజేసింది. ప్రమాదంలో మరణించిన ఒప్పంద ఉద్యోగి కుటుంబానికి రూ.5 లక్షలు, సహజంగా మరణిస్తే రూ. 2 లక్షలు పరిహారం ఇవ్వనుంది. దీంతో ఖజానాపై రూ.365 కోట్ల భారం పడుతుందని ప్రభుత్వం పేర్కొంది.

Readmore:త్వరలో పీఆర్సీ..ముఖ్యమంత్రి వెల్లడి