Site icon vidhaatha

ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామికి కరోనా

విధాత‌:కరోనా వైరస్ కేసులు ఇటీవల తగ్గుముఖం పట్టినప్పటికీ తాజాగా మళ్లీ పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలున్నాయంటూ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నట్టుగానే పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామికి కరోనా సోకింది. గత రెండు రోజులుగా ఆయన అస్వస్థతతో బాధపడుతున్నారు. దీంతో, ఈ రోజు ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన వెంటనే ఐసొలేషన్ లోకి వెళ్లి, చికిత్స తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని… త్వరలోనే తాను పూర్తి ఆరోగ్యంతో బయటకు వస్తానని చెప్పారు.

Exit mobile version