విధాత:రాష్ట్ర ఆర్థిక మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు మంత్రిత్వ శాఖల వారీగా ఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రులు, శాఖల కార్యదర్శులతో చర్చిస్తున్నాం. ఢిల్లీ విజ్ఞానవంతులకు నిలయం అనేక విషయాలు తెలుసుకునేందుకు ఢిల్లీ వస్తాం.. అన్నీ చెప్పి రావాలా. ఢిల్లీకి వస్తే రాజకీయాలు చేసేందుకే వస్తారా..? అన్నారు.
ఏపీ స్టేట్ డెవలప్ మెంటు కార్పోరేషన్ చేసిన అప్పు గుట్టుగా చేయలేదు. ప్రజలను మభ్యపెట్టేందుకే పీఏసీ ఛైర్మెన్ అవాస్తవాలు మాట్లాడుతున్నారు.అమ్మఒడి, ఆసరా, చేయూత పథకాల కోసమే అప్పు తీసుకున్నాం. జీవోల ప్రకారమే లోన్ తీసుకున్నాం. గుట్టుగా ఏమి తీసుకోలేదు.మద్యం పై వచ్చే పన్నును అప్పులు కట్టడానికి కేటాయించడం జరిగింది. మద్యంపై పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలు చెల్లిస్తున్నాం. అప్పు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. టిడిపి హయాంలో వేల కోట్లు అప్పులు చేశారు. మరి, అనుమతులు తీసుకున్నారా..?
టిడిపి ప్రభుత్వం రూ. 96 వేల కోట్లు నుంచి 2 లక్షల కోట్లు అప్పులు చేశారు. ప్రభుత్వం మారింది, మేమే ఆ అప్పులు కడుతున్నాం. ప్రభుత్వం మారితే, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఉన్న అప్పులు కడతారు. అది నిరంతర ప్రక్రియ.
రుణాల అంశాలు చూసేందుకు ప్రభుత్వ అధికారులకి అధికారాలు కేటాయిస్తారు.. అందులో తప్పేముంది..?రాష్ట్రంలో అన్ని ఆర్డర్ లు గవర్నర్ పేరు మీదే వస్తాయి. ఆయన రాష్ట్ర పెద్ద. ప్రైవేట్ హోటల్ లో ఉన్నారంటున్నారు. ఆధారలున్నాయా. ఢిల్లీలో నాకు స్నేహితులు.. బంధువులు ఉండరా.. నా ఢిల్లీ పర్యటన పట్ల కొందరు అన్యాయంగా కథనాలు రాస్తున్నారు. నేను హోటళ్లలో ఉంటే ప్రభుత్వానికి చెల్లించే బిల్లుల్లో లెక్కలు వస్తాయి కదా.. అవాస్తవాలు ప్రచారం చెయ్యుద్దన్నారు.