విధాత: స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. వచ్చే నెల 24 వరకు మధ్యంతర బెయిల్ కొనసాగనుంది. అనారోగ్య కారణాలతో, కంటి చికిత్స కోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. ప్రధాన బెయిల్ పిటిషన్ వచ్చే నవంబర్ 10న విచారణ చేయనున్నట్లు హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.
తిరిగి చంద్రబాబు నవంబర్ 28వ తేదీన సరెండర్ కావాలని కోర్టు సూచించింది. సెప్టెంబర్ 9న స్కిల్ స్కామ్ కేసులు అరెస్ట్ అయిన చంద్రబాబు ఇప్పటివరకు 53 రోజులపాటు జైల్లో ఉన్నారు. చంద్రబాబుకు స్కిల్ స్కామ్ కేసులో మాత్రమే బెయిల్ రాగా , ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సుప్రీంకోర్టు అరెస్టుపై స్టే విధించింది . ఈ నేపథ్యంలో ఇతర కేసుల్లో చంద్రబాబు అరెస్టుకు అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.