విధాత : టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారీ ఊరట దక్కింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ హైకోర్టు బాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరీ చేసింది. బాబు బెయిల్ పిటిషన్ విచారించిన జస్టిస్ టి.మల్లిఖార్జున్ రావు ఆయనకు బెయిల్ మంజూరీ చేశారు.
స్కిల్ కేసులో సెప్టెంబర్ 9న అరెస్టయిన చంద్రబాబు గత ఆక్టోబర్ 31వ తేదీ నుంచి అనారోగ్య కారణాలతో నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌పై బయట ఉన్నారు. మధ్యంతర బెయిల్ కూడా ఈనెల 28వరకే వర్తించనుంది. ఇప్పుడు ఈ కేసులో హైకోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరీ చేయడంతో బాబుకు న్యాయపర ఊరట దక్కినట్లయ్యింది.