మాకు రూ.50 లక్షలకు బీమా కల్పించాలి…ఔట్‌ సోర్సింగ్‌ స్టాఫ్‌ నర్సెస్‌

విధాత‌:కొవిడ్‌ విధులు నిర్వహిస్తున్న రెగ్యులర్‌ వైద్య సిబ్బందిలాగే తమకూ రూ.50 లక్షలకు బీమా కల్పించాలని ఏపీ స్టేట్‌ గవర్నమెంట్‌ కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ స్టాఫ్‌ నర్సెస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ నర్సుల (నర్సింగ్‌ ఆఫీసర్లు) సమస్యలు వెంటనే పరిష్కారించాలని, లేకుంటే ఈ నెల 28న సమ్మెకు దిగుతామని హెచ్చరించింది. ఈ మేరకు యూనియన్‌ రాష్ట్ర కమిటీ గౌరవాధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.దయామణి, జి.భవాని ఒక ప్రకటన విడుదల […]

  • Publish Date - June 17, 2021 / 05:13 AM IST

విధాత‌:కొవిడ్‌ విధులు నిర్వహిస్తున్న రెగ్యులర్‌ వైద్య సిబ్బందిలాగే తమకూ రూ.50 లక్షలకు బీమా కల్పించాలని ఏపీ స్టేట్‌ గవర్నమెంట్‌ కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ స్టాఫ్‌ నర్సెస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.

కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ నర్సుల (నర్సింగ్‌ ఆఫీసర్లు) సమస్యలు వెంటనే పరిష్కారించాలని, లేకుంటే ఈ నెల 28న సమ్మెకు దిగుతామని హెచ్చరించింది.

ఈ మేరకు యూనియన్‌ రాష్ట్ర కమిటీ గౌరవాధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.దయామణి, జి.భవాని ఒక ప్రకటన విడుదల చేశారు.

సమస్యల పరిష్కారం కోరుతూ వరుసగా మూడోరోజు నిరసనలు చేపట్టినట్టు చెప్పారు.