విధాత: టీడీపీ పార్టీ ఆఫీస్ పై దాడికి సంబంధించిన కేసులో దర్యాప్తులో భాగంగా 6మందిని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు గుంటూరు పోలీసులు.
జోగ రాజు S/o నూకరాజు ,sk. బాబు S/o సలీం ,Sk సైదా S/o హుస్సేన్ ,బంక సూర్యసురేష్ @ సూర్య S/o శ్యాం కుమార్ ,కల్లా మోహన్ కృష్ణారెడ్డి S/o శ్రీనివాసరెడ్డి ,కాండ్రు కుంట గురవయ్య S/o వెంకటేశ్వర్లు ను అరెస్ట్ చేశారు. మిగతా ముద్దాయిలను పట్టుకొనుటకు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
వీడియో క్లిప్పింగ్స్,తదుపరి దర్యాప్తులో మిగతా ముద్దాయి లను గుర్తించి ఈ కేసులో వారిని కూడా అదుపులోకి తీసుకుంటాం,ఈ దాడిలో పాల్గొన్న వారందరును గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.