అశోక్‌గజపతిరాజు జైలుకెళ్లడం తప్పదు: విజయసాయిరెడ్డి

విధాత,విశాఖపట్నం: ‘మాన్సాస్‌ ట్రస్ట్‌లో వందల ఎకరాలు కాజేసిన దొంగ అశోక్‌గజపతిరాజు’ అంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అశోక్‌ గజపతిరాజుపై గతంలో ఫోర్జరీ కేసు కూడా ఉందని.. ఆయన జైలుకు వెళ్లడం తప్పదన్నారు. మాన్సాస్‌ ట్రస్ట్‌ తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ‘‘భూకబ్జా వ్యవహారంలో టీడీపీ నేతలు తాత్కాలికంగా స్టే తెచ్చుకోగలిగారు. చేసిన తప్పులకు శిక్ష నుంచి మాత్రం తప్పుకోలేరు. ప్రభుత్వ భూములు ఆక్రమించినవారిని […]

  • Publish Date - June 18, 2021 / 11:38 AM IST

విధాత,విశాఖపట్నం: ‘మాన్సాస్‌ ట్రస్ట్‌లో వందల ఎకరాలు కాజేసిన దొంగ అశోక్‌గజపతిరాజు’ అంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అశోక్‌ గజపతిరాజుపై గతంలో ఫోర్జరీ కేసు కూడా ఉందని.. ఆయన జైలుకు వెళ్లడం తప్పదన్నారు. మాన్సాస్‌ ట్రస్ట్‌ తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ‘‘భూకబ్జా వ్యవహారంలో టీడీపీ నేతలు తాత్కాలికంగా స్టే తెచ్చుకోగలిగారు. చేసిన తప్పులకు శిక్ష నుంచి మాత్రం తప్పుకోలేరు. ప్రభుత్వ భూములు ఆక్రమించినవారిని వదిలిపెట్టేది లేదని’’ ఎంపీ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు.