ఢిల్లీకి వెళ్లి పోరాటం చేస్తా..

విధాత: రాయలసీమకు నీటి కోసం అవసరమైతే ఢిల్లీకి వెళ్లి పోరాటం చేస్తామని నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. హిందూపురంలో నిర్వహించిన సీమ తెదేపా నేతల సదస్సుకు ఆయన హజరయ్యారు. ‘‘సీమ కోసం ఎన్టీఆర్‌ హంద్రీనీవా ప్రాజెక్ట్‌ తెచ్చారు. హంద్రీనీవా ద్వారా చెరువులకు నీరు ఇచ్చే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. సీమకు నీటి కోసం అవసరమైతే దిల్లీకి వెళ్లి పోరాటం చేస్తాం. బీటీ ప్రాజెక్టుకు, అనంతలో అన్ని చెరువులకు నీరు ఇవ్వాలి’’ అని బాలకృష్ణ డిమాండ్ […]

  • Publish Date - October 17, 2021 / 01:50 PM IST

విధాత: రాయలసీమకు నీటి కోసం అవసరమైతే ఢిల్లీకి వెళ్లి పోరాటం చేస్తామని నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. హిందూపురంలో నిర్వహించిన సీమ తెదేపా నేతల సదస్సుకు ఆయన హజరయ్యారు. ‘‘సీమ కోసం ఎన్టీఆర్‌ హంద్రీనీవా ప్రాజెక్ట్‌ తెచ్చారు. హంద్రీనీవా ద్వారా చెరువులకు నీరు ఇచ్చే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. సీమకు నీటి కోసం అవసరమైతే దిల్లీకి వెళ్లి పోరాటం చేస్తాం. బీటీ ప్రాజెక్టుకు, అనంతలో అన్ని చెరువులకు నీరు ఇవ్వాలి’’ అని బాలకృష్ణ డిమాండ్ చేశారు.