బిసి జనార్ధన్ రెడ్డి అక్రమ అరెస్టుపై డిజిపికి లేఖ రాసిన ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు
★ కర్నూలు జిల్లాలోని బనగానపల్లి పోలీస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే బిసి జనార్దన్ రెడ్డి, అతని మద్దతుదారులపై అక్రమ కేసు జనాయించారు.
★ జనార్ధన్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన వ్యక్తి, అతని అనుచరులైన వైసీపీ గుండాలే జనార్దన్ రెడ్డి ఇంటిపై దాడి చేయడానికి వెళ్ళారు.
★ జనార్దన్ రెడ్డి, అతని మద్దతుదారులు వారిని ప్రతిఘటించినందుకు వారిపై అక్రమ కేసు నమోదు చేశారు.
★ 2021 మే 23 వ తేదీ అర్ధరాత్రి అక్రమ అరెస్టులు చేశారు.
★ అరెస్టు చేసిన వారిలో జనార్థన్ రెడ్డి, మురళి, రమణ లను 24 గంటల్లో కోర్టుకు హాజరుపరిచారు.
★ కానీ, ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న మరో ఆరుగురు జనార్దన్ రెడ్డి మద్దతుదారులను అరెస్టు చేసి 24 గంటల్లో కోర్టులో హాజరుపరచలేదు.
★ అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటలలోపు కోర్టులో హాజరుపర్చాలనే నియమం ఉన్నప్పటికీ, చట్టవిరుద్ధంగా వారిని పోలీసు నిర్బంధంలో ఉంచారు.
★ వారిలో 1. శ్రీను, 2. దివాకర్, 3. విజయ్ రెడ్డి, 4. నరసింహ, 5. పెద్దా హుస్సేని, 6 అత్తర్ షాహిద్ లు ఉన్నారు.
★ మాజీ ఎమ్మెల్యే బిసి జనార్థన్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగా ఇరికించటానికి బాధితులను బలవంతంగా ఒప్సించడానికి చట్టవిరుద్ధంగా ఆరుగురిని పోలీసు కస్టడీలో ఉంచినట్లు తెలుస్తోంది.
★ ఇటువంటి అక్రమ నిర్బంధాలు చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం, ప్రజాస్వామ్య నిబంధనలకు విరుద్ధం, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన.
★ అందువల్ల, అక్రమంగా అదుపులోకి తీసుకున్న తెదేపా నాయకులను వెంటనే విడుదల చేయాలి.
★ భవిష్యత్తులో ఇటువంటి అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు చేయకుండా చర్యలు తీసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను