తిరుపతి:బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రాజు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రైతు వ్యతిరేకి.వైసిపి హయాంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు,ఎపిలో రైతులకు ప్రభుత్వ బకాయిలు 3వేల కోట్లు పెండింగ్ లో ఉన్నాయి.రైతు సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తాం అన్నారు.
2లక్షల 40వేల పోస్టులు ఖాళీగా ఉంటే 10వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఎలా ఇస్తారు..?నిరుద్యోగులతో కలిసి రేపు కలెక్టర్ కార్యాలయాలను ముట్టడిస్తాం.నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చూశానంటూ జగన్ చెప్పినవన్నీ అబద్థాలే.ఎపిలో అవినీతి పాలన రాజ్యమేలుతోందని మండిపడ్డారు.