చెత్త సేక‌ర‌ణ వాహ‌నాల‌పై వైసీపీ రంగులు వేయడంతో సోమువీర్రాజు ఆగ్ర‌హం

విధాత‌: స్వచ్ఛ్ భారత్ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం పేరుతో క్లాప్ కార్యక్రమం నిర్వహాణపై బీజేపీ అభ్యంతరం వ్య‌క్తం చేసింది.క్లీన్ ఏపీలో భాగంగా కొనుగోలు చేసిన చెత్త సేకరణ వాహనాలను పరిశీలించిన బీజేపీ ఏపీ అధ్యక్షడు సోము వీర్రాజు.వాహానాలపై జగన్ పేరుతో స్టిక్కరింగ్, వైసీపీ రంగులు వేయడంపై సోమువీర్రాజు మండిప‌డ్డాడు. రాష్ట్రంలో సింగిల్ స్టిక్కర్ వెళ్లి డబుల్ స్టిక్కర్ వచ్చింది.స్వచ్ఛ భారత్ కింద కేంద్రం రూ. 1015 కోట్ల నిధులను రాష్ట్రానికి కేటాయించింది.ఈ చెత్త వాహానాలను ఇంత అందంగా […]

  • Publish Date - October 1, 2021 / 10:02 AM IST

విధాత‌: స్వచ్ఛ్ భారత్ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం పేరుతో క్లాప్ కార్యక్రమం నిర్వహాణపై బీజేపీ అభ్యంతరం వ్య‌క్తం చేసింది.క్లీన్ ఏపీలో భాగంగా కొనుగోలు చేసిన చెత్త సేకరణ వాహనాలను పరిశీలించిన బీజేపీ ఏపీ అధ్యక్షడు సోము వీర్రాజు.వాహానాలపై జగన్ పేరుతో స్టిక్కరింగ్, వైసీపీ రంగులు వేయడంపై సోమువీర్రాజు మండిప‌డ్డాడు.

రాష్ట్రంలో సింగిల్ స్టిక్కర్ వెళ్లి డబుల్ స్టిక్కర్ వచ్చింది.స్వచ్ఛ భారత్ కింద కేంద్రం రూ. 1015 కోట్ల నిధులను రాష్ట్రానికి కేటాయించింది.ఈ చెత్త వాహానాలను ఇంత అందంగా తయారు చేయించడానికి నిధులు కూడా లేవు.. ఇవన్నీ కేంద్ర నిధులే.గ్రామ సచివాలయాలకు రంగులేసి కోర్టుతో ప్రభుత్వం చీవాట్లు తిన్నది.ఈ ప్రభుత్వానిది తోలుమందం.. పద్దతి మార్చుకోవడం లేదు.మోడీ ఫొటో లేకుండా వాహానాలు ప్రారంభిస్తారా..?వెంటనే మోడీ ఫొటో వేయాలి.రాష్ట్ర ప్రభుత్వానికి చాలా కేంద్ర నిధులు వస్తున్నాయి.ఈ ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదు.. కేవలం తిట్ల దండకంతో సరిపెడుతోందని ఆయ‌న వెల్ల‌డించారు.