Site icon vidhaatha

బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డికి కీలక పదవి

విధాత:వైఎస్సార్‌సీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక పదవి కట్టబెట్టారు. రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారటీ చైర్మన్‌ పదవి(శాప్‌)ని బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డికి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో శనివారం నామినేటెడ్‌ పోస్టులను ప్రకటించారు. దీనిలో భాగంగా ​ రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ పదవిని సిద్ధార్థ్‌రెడ్డికి అప్పచెప్పారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ గెలుపునకు బైరెడ్డి కీలక పాత్ర పోషించారు.

కాగా పాదయాత్ర సమయంలో నందికొట్కూరు ప్రచార సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. బైరెడ్డి తన మనసులో ఉన్నాడని, అధికారంలోకి వచ్చాక కచ్చితంగా మంచి ప్రాధాన్యత గల పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. పాదయాత్ర సమయంలో సీఎం జగన్ ఇచ్చిన హామీని ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా నెరవేర్చారని బైరెడ్డి అభిమానులు, నియోజకవర్గ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు పోస్ట్ ఇస్తున్నట్లు ప్రకటించగానే బైరెడ్డి ఇంటి దగ్గర. పార్టీ ఆఫీసు దగ్గర కార్యకర్తలు, అభిమానులు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకుంటున్నారు.

ప్రస్తుతం నందికొట్కూరు నియోజవకర్గ ఇంచార్జ్‌గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తనకు శాప్‌ పదవి రావడంపై బైరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు కడపలోని ఆయన నివాసంలో సిద్ధార్థ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించారు. 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు ఇచ్చారు.

Exit mobile version