Site icon vidhaatha

అశోకగజపతిరాజుపై కేసు: హైకోర్టు స్టే

అమరావతి: అశోక్‌ గజపతిరాజు ప్రోద్బలంతోనే మాన్సాస్‌ ట్రస్ట్ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారంటూ.. నమోదైన కేసులో తదుపరి చర్యలు చేపట్టవద్దని రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు మాన్సాస్‌ ట్రస్ట్‌ ఈవో అశోక్‌ గజపతిరాజు వేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని అశోక్‌ గజపతి రాజు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో అశోక్‌పై నమోదైన కేసులో తదుపరి చర్యలను నిలువరిస్తూ హైకోర్టు మధ్యంతరం ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషన్‌ విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది.

Exit mobile version