విధాత,అమరావతి: సీఎం జగన్‌రెడ్డి ఢిల్లీయాత్ర రాష్ట్ర ప్రజల కోసమా..వ్యక్తిగతమా? అని తెలుగుదేశం సీనియర్ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బెయిల్ రద్దవకూడదని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను జగన్‌రెడ్డి వేడుకున్నారా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు. వైసీపీ నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామరాజుని కట్టడి చేయాలని అమిత్ షాని కోరారా? అని నిలదీశారు. వైఎస్ వివేకానందారెడ్డి కేసులో సీబీఐ జగన్ కుటుంబసభ్యుడిని అరెస్ట్ చేయబోతుందని జగన్‌కు భయం పటుకుందన్నారు. వివేకా హత్యకేసు విచారణలో సీబీఐని ఏదో అదృశ్యశక్తి అడ్డుకుంటోందని వర్ల రామయ్య అన్నారు.