విధాత : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో జైలులో ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు లాయర్లు శనివారం ఏసీబీ కోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయనకు జైలులో ఏసీ సౌకర్యం కల్పించాలని కోరుతూ ఈ పిటిషన్ దాఖలు చేశారు. బాబుకు పరీక్షలు జరిపిన వైద్య బృందం కూడా ఆయనకు కూల్ కన్వీనెంట్ అవసరమని సూచించింది. వేడి వాతావరణానికి డీహైడ్రేషన్‌కు, స్కిన్ ఎలర్జీలకు గురైన బాబు ఆరోగ్య పరిస్థితిని చూసి సతీమణి భువనేశ్వరి, లోకేశ్‌లు శనివారం ములాఖత్ సందర్భంగా కంటతడిపెట్టారు. లోకేశ్ బాబుకు ఏసీ వసతి కల్పించకపోవడం పట్ల జైళ్ల శాఖ డీఐజీతో వాగ్వివాదం చేశారు. ఈ నేపధ్యంలో బాబు లాయర్లు ఆయనకు ఏసీ వసతి కల్పించాలంటూ హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఏసి వసతి ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. చంద్రబాబు లాయర్ల హౌస్ మోషన్ పిటిషన్ విచారించిన ఎసిబి కోర్టు బాబు ఉన్న బ్యారెక్ లో తక్షణమే ఏసీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది