Site icon vidhaatha

ఆచార్య సింహాద్రి మృతికి చంద్రబాబునాయుడు సంతాపం

ప్రముఖ విద్యావేత్త, ఆంధ్రా విశ్వవిద్యాలయం మాజీ ఉప కులపతి ఆచార్య సి.సింహాద్రి మృతికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆంధ్రా యూనివర్సిటీతోపాటు బెనారస్ హిందూ యూనివర్సిటీ (పాట్నా), ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (గుంటూరు)లకు వైస్ చాన్స్ లర్ గా వ్యవహరించిన సింహాద్రి ఆయా విశ్వవిశ్వవిద్యాలయాల ద్వారా ఉన్నత విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. తాను విద్యనభ్యసించిన ఆంధ్రా యూనివర్సిటీకే ఉపకులపతి స్థాయికి ఎదిగి యువతలో స్పూర్తినింపారు. బస్తీల్లోని నిరుపేద పిల్లలకు స్కూలు ఏర్పాటుచేసి విద్యాదాతగా కీర్తి గడించారు. సింహాద్రి కుటుంబసభ్యులకు చంద్రబాబునాయుడు ప్రగాడ సానుభూతి తెలిపారు.

Exit mobile version