కురుపాం ఇన్ ఛార్జి థాట్రాజ్ మృతికి చంద్రబాబునాయుడు సంతాపం

విధాత:కురుపాం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జి నరసింహప్రియ థాట్రాజ్ కరోనా కాటుకు గురై మృతిచెందడంపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నరసింహప్రియ థాట్రాజ్ వెనుకబడిన గిరిజన ప్రాంతంలో సమస్యల పరిష్కారానికి, గిరిజనుల అభివృద్ధికి విశేషంగా కృషిచేశారు. గిరిజనుల హక్కుల కోసం ఆమె అలుపెరగని పోరాటం చేశారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఆమె అందించిన సేవలను కొనియాడారు. కుటుంబసభ్యులకు చంద్రబాబునాయుడు సానుభూతి తెలియజేస్తూ థాట్రాజ్ మృతికి సంతాపం […]

  • Publish Date - May 31, 2021 / 10:46 AM IST

విధాత:కురుపాం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జి నరసింహప్రియ థాట్రాజ్ కరోనా కాటుకు గురై మృతిచెందడంపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నరసింహప్రియ థాట్రాజ్ వెనుకబడిన గిరిజన ప్రాంతంలో సమస్యల పరిష్కారానికి, గిరిజనుల అభివృద్ధికి విశేషంగా కృషిచేశారు. గిరిజనుల హక్కుల కోసం ఆమె అలుపెరగని పోరాటం చేశారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఆమె అందించిన సేవలను కొనియాడారు. కుటుంబసభ్యులకు చంద్రబాబునాయుడు సానుభూతి తెలియజేస్తూ థాట్రాజ్ మృతికి సంతాపం తెలిపారు.