వెక్కి వెక్కి ఏడ్చిన చంద్ర‌బాబు..!

విధాత: ప్రెస్ మీట్లో చంద్రబాబు కన్నింటి పర్యంతమయ్యారు. ఆయన మాట్లాడుతూ నా 40 ఏండ్లలో ఇంత ఘోరమైన సభ చూడలేదన్నారు. కౌరవుల సభలా వ్యవహరించారు నా భార్యని నీచ రాజకీయాలలోకి లాగడం హేయమని అన్నారు. తప్పని చెప్పాల్సిన స్పీకర్ నోరు మెదపలేదని, తమ్మినేని గతాన్ని మర్చిపోయారని ఆత్మ విమర్శ చేసుకోవాలి తమ్మినేని నాకు మైక్ ఇవ్వకపోవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకంటే నాకు ఏ పదవులు అవసరం లేదు ప్రజలు తెలుసుకోవాలి […]

  • Publish Date - November 19, 2021 / 09:46 AM IST

విధాత: ప్రెస్ మీట్లో చంద్రబాబు కన్నింటి పర్యంతమయ్యారు. ఆయన మాట్లాడుతూ నా 40 ఏండ్లలో ఇంత ఘోరమైన సభ చూడలేదన్నారు. కౌరవుల సభలా వ్యవహరించారు నా భార్యని నీచ రాజకీయాలలోకి లాగడం హేయమని అన్నారు. తప్పని చెప్పాల్సిన స్పీకర్ నోరు మెదపలేదని, తమ్మినేని గతాన్ని మర్చిపోయారని ఆత్మ విమర్శ చేసుకోవాలి తమ్మినేని నాకు మైక్ ఇవ్వకపోవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంతకంటే నాకు ఏ పదవులు అవసరం లేదు ప్రజలు తెలుసుకోవాలి తప్పులని వేరొకరిపై రుద్ది పైశాచిక ఆనందం పొందుతున్నారు ధర్మానికి , అధర్మానికి జరుగుతున్న యుద్ధం ఇదని ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటానన్నారు. రికార్డులు నాకు కొత్త కాదన్నారు. రాజకీయాలకు సంబంధం లేని నా భార్యని దూషించడం నీచమని అన్నారు.

రాజకీయాల్లో విలువల ఉండాలనే ఇంతకాలం ఊరుకున్నానని.. క్రమశిక్షణ ఉంది కాబట్టే సైలెంట్ గా ఉన్నానని మాకు చేతకాక కాదు ఇంత కంటే నీచంగా మాట్లాడగలనన్నారు. ప్రజలు నాకు మద్దతు ఇవ్వాలి.. రాష్ట్రానికి పాటి పీడ వదలాలన్నారు. మళ్ళీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడ తానన్నారు. మన ఇంటి వాళ్ళని అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి అదే నా ఆవేదన అంటూ చంద్రబాబు కన్నీటితో ప్రెస్ మీట్ ముగించారు.