జగన్ రెడ్డి అభివృద్ధిని గాలికి వదిలేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు

విధాత‌: రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రాన్ని అప్పగిస్తే…. జగన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు రాజప్ప పేర్కొన్నారు. జగన్ రెడ్డి అభివృద్ధిని గాలికి వదిలేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే వారిని అక్రమ అరెస్టులు చేయడం జైల్లో పెట్టడం ఆంధ్రప్రదేశ్ లో నిత్యకృత్యంగా మారాయి. రాష్ట్ర పరిస్థితి గురించి రాష్ట్రపతిగారికి, లా అండ్ ఆర్డర్ గురించి అమిత్ షా తో కలిస్తే ఓటుకు నోటు […]

  • Publish Date - October 26, 2021 / 09:52 AM IST

విధాత‌: రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రాన్ని అప్పగిస్తే…. జగన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు రాజప్ప పేర్కొన్నారు. జగన్ రెడ్డి అభివృద్ధిని గాలికి వదిలేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే వారిని అక్రమ అరెస్టులు చేయడం జైల్లో పెట్టడం ఆంధ్రప్రదేశ్ లో నిత్యకృత్యంగా మారాయి.

రాష్ట్ర పరిస్థితి గురించి రాష్ట్రపతిగారికి, లా అండ్ ఆర్డర్ గురించి అమిత్ షా తో కలిస్తే ఓటుకు నోటు కేసులో ఉన్న చంద్రబాబు ఎలా కలుస్తారు… అని అడుగుతున్నారు. ఓటుకు నోటు అనే కేసు అనేది ఎక్కడ ఉంది. లేని కేసు గురించి అడగడం విడ్డూరంగా ఉందన్నారు.ఎ1 మరియు ఎ2 లు ప్రధాన మంత్రిని తమ స్వప్రయోజనల కోసం పదే పదే కలుస్తున్నారు మరి దీనికి ఏమి సమాధానం చెబుతారు కన్నబాబు అని రాజప్ప ప్రశ్నించారు.