అమ‌రావ‌తి అంటే నాకు ప్రేమ : జ‌గ‌న్

అమరావతి ప్రాంతమంటే నాకు వ్యతిరేకత లేదని.. పైగా నా ఇల్లూ ఇక్కడే ఉందని, ఈ నేలంటే నాకు ప్రేమ అని సీఎం జగన్‌ అసెంబ్లీలో వెల్లడించారు. ఇక్కడ మౌలిక వసతుల కల్పనకే రూ.లక్ష కోట్లు ఖర్చు అవుతున్నప్పుడు.. రాజధాని అనే ఊహాచిత్రం అమరావతిలో సాధ్యమవుతుందా?అని చెప్పారు. ‘‘పిల్లలందరూ పెద్ద నగరాలైన హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలకు వెళ్లాల్సిందేనా. ప్రస్తుతంలో ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద నగరం విశాఖ. అక్కడ అన్నీ వసతులు ఉన్నాయి. వాటికి అదనపు హంగులు దిద్దితే, ఐదారేళ్ల […]

  • Publish Date - November 22, 2021 / 09:56 AM IST

అమరావతి ప్రాంతమంటే నాకు వ్యతిరేకత లేదని.. పైగా నా ఇల్లూ ఇక్కడే ఉందని, ఈ నేలంటే నాకు ప్రేమ అని సీఎం జగన్‌ అసెంబ్లీలో వెల్లడించారు. ఇక్కడ మౌలిక వసతుల కల్పనకే రూ.లక్ష కోట్లు ఖర్చు అవుతున్నప్పుడు.. రాజధాని అనే ఊహాచిత్రం అమరావతిలో సాధ్యమవుతుందా?అని చెప్పారు. ‘‘పిల్లలందరూ పెద్ద నగరాలైన హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలకు వెళ్లాల్సిందేనా. ప్రస్తుతంలో ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద నగరం విశాఖ. అక్కడ అన్నీ వసతులు ఉన్నాయి. వాటికి అదనపు హంగులు దిద్దితే, ఐదారేళ్ల తర్వాత అయినా హైదరాబాద్‌ వంటి నగరాలతో పోటీ పడే అవకాశం ఉంది’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.