మైనింగ్‌ శాఖపై సీఎం జగన్‌ సమీక్ష

మైనింగ్‌ శాఖలో సంస్కరణలు విధాత ,అమరావతి :ఈ– ఆక్షన్‌ ద్వారా మైనర్‌ మినరల్స్‌ అమ్మాలని నిర్ణయం. సీనరేజీ ఫీజు వసూలను ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించాలని నిర్ణయం. గ్రానైట్‌ మైనింగ్‌లో సైజు (పరిమాణం) పద్దతిలో కాకుండా బరువు ఆధారంగా సీనరేజీ నిర్ణయించాలని నిర్ణయం. ఇకపై ఎన్నిటన్నులు బరువు ఉంటే.. ఆమేరకు సీనరేజీ నిర్ణయం. దీనివల్ల కనీసం 35 నుంచి 40శాతం ఆదాయం పెరుగుతుందని అంచనా,లీజులు పొంది, గనులు నిర్వహించని చోట కొత్తగా ఈ వేలం నిర్వహించాలని నిర్ణయం. దీనివల్ల మరో […]

  • Publish Date - May 20, 2021 / 01:58 AM IST

మైనింగ్‌ శాఖలో సంస్కరణలు

విధాత ,అమరావతి :ఈ– ఆక్షన్‌ ద్వారా మైనర్‌ మినరల్స్‌ అమ్మాలని నిర్ణయం. సీనరేజీ ఫీజు వసూలను ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించాలని నిర్ణయం. గ్రానైట్‌ మైనింగ్‌లో సైజు (పరిమాణం) పద్దతిలో కాకుండా బరువు ఆధారంగా సీనరేజీ నిర్ణయించాలని నిర్ణయం. ఇకపై ఎన్నిటన్నులు బరువు ఉంటే.. ఆమేరకు సీనరేజీ నిర్ణయం. దీనివల్ల కనీసం 35 నుంచి 40శాతం ఆదాయం పెరుగుతుందని అంచనా,లీజులు పొంది, గనులు నిర్వహించని చోట కొత్తగా ఈ వేలం నిర్వహించాలని నిర్ణయం. దీనివల్ల మరో రూ.వేయికోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తుందని అంచనా,ఈ నిర్ణయాలకు సీఎం ఆమోదం.

సెప్టెంబరు నుంచి కొత్త నిర్ణయాలు అమల్లోకి వస్తాయన్న అధికారులు.మైనింగ్‌ శాఖలో నిఘా, అమలు విభాగం పటిష్టంగా ఉండాలన్న సీఎం. ఆదాయాలకు గండి పడకుండా చూడాలన్న సీఎం.వర్షాలు వచ్చేలోగా కనీసం 60 నుంచి 79 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుకను అందుబాటులోకి ఉంచండి. వర్షాలు వల్ల రీచ్‌లు మునిగిపోయే అవకాశం ఉంటుంది, మళ్లీ ఇసుకకు ఇబ్బందులు రాకూడదు.అందుకనే సరిపడా నిల్వలను అందుబాటులోకి ఉంచాలని అదేశించిన సీఎం.
హాజరైన పంచాయతీరాజ్, భూగర్భగనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మైనింగ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, భూగర్భగనుల శాఖ డైరెక్టర్‌ (డిఎంజి) విజి.వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు.