విధాత:పన్ను భారాలపై విశాఖలో ఆందోళన చేస్తున్న సిపిఎం కార్యకర్తల అరెస్టును ఖండించండంటూ ఆంధ్ర ప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య సిహెచ్ బాబూరావు కన్వీనర్ఆన్నారు.ఆస్తివిలువ ఆధారిత ఇంటి పన్ను,చెత్తపన్ను రద్దుకై విశాఖపట్నంలో నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం సందర్భంలో ఆందోళన చేస్తున్న సిపిఎం,ప్రజాసంఘాల నేతలను , కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య తీవ్రంగా ఖండిస్తోంది. తక్షణమే అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వం పన్ను భారాల పై రాజకీయ పక్షాలతో, పౌర సంఘాలతో, ప్రజా సంఘాలతో చర్చలు జరపాలి.కరోనా కాలంలో ప్రజల కష్టాలను గమనించి పన్నుల భారాలను ఉపసంహ రించుకోవాలి. ప్రభుత్వం పునరాలోచన చేయకుండా, తమ గోడు వెళ్లబోసుకుంటన్న వారిని అరెస్టు చేయించడం అన్యాయం. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి చర్చలు ప్రారంభించాలి.
ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను ,చెత్త పన్నులను రద్దు చేయాలనీ సమాఖ్య కోరుతున్నది.