విధాత,విజయవాడ:నగరంలో ఉన్న 12 శాశ్వత వ్యాక్సినేషన్ కేంద్రాలతో పాటు 286 సచివాలయం పరిధిలో 110 కేంద్రాల్లో ఆదివారం కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ మొదటి / రెండోవ డోస్ టీకా ఇవ్వనున్నారు. 40000 కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ అందుబాటులో ఉన్నవని, అన్ని కేంద్రములలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులందరికీ వ్యాక్సినేషన్ నిర్వహింప బడుతున్నది.. అదే విధంగా 45 సంవత్సరాలు నిండిన వారికి మొదటి / రెండోవ డోస్‌గా టీకా వేయనున్నందున అర్హలు మాత్రమే వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లాలన్నారు. ప్రతి ఒక్కరు విధిగా తమ యొక్క అధార్ కార్డు తీసుకువెళ్లాలన్నని, మాస్క్ వినియోగం, భౌతిక దూరం పాటించాలన్నారు.
Readmore:కోవిడ్ వ్యాక్సిన్ తో లైంగిక సామర్థ్యం తగ్గుతుందా ..?