విధాత: సెంటు స్థలంలో ఇంటి నిర్మాణం సాధ్యం కాదని అగ్ని ప్రమాదాలు, ఆరోగ్య, మంచినీటి తదితర సమస్యలు ఉత్పన్నమవుతాయని హైకోర్టు వ్యాఖ్యానించింది.
పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలని సిపిఐ ముందు నుండే డిమాండ్ చేయటం గమనార్హం.సెంటు స్థలంలో ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చే రూ.1,80,000 ఏమాత్రం సరిపోదు.రాష్ట్ర ప్రభుత్వమే పేదలకు నివాసయోగ్యమైన ఇళ్లు నిర్మించి ఇవ్వాలి లేదా రూ.5 లక్షల చొప్పున మంజూరు చేయాలన్నారు సీపీఐ రామకృష్ణ.