అప్పులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి

విధాత‌: అప్పులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ సాగు చట్టాల రద్దు కోరుతూ రైతు సంఘాల ఆధ్వర్యంలో రైల్ రోకో నిర్వహిస్తామని ప్రకటించారు. నల్లచట్టాలు రద్దు అయ్యేవరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. యూపీ ఘటనపై ఇప్పటివరకు ప్రధాని మోదీ స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఏపీలో కరెంట్ కోతలు మొదలయ్యాయని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై జగన్ ప్రభుత్వం ఎందుకు నిజాలు చెప్పడం లేదు? అని రామకృష్ణ […]

  • Publish Date - October 18, 2021 / 11:00 AM IST

విధాత‌: అప్పులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ సాగు చట్టాల రద్దు కోరుతూ రైతు సంఘాల ఆధ్వర్యంలో రైల్ రోకో నిర్వహిస్తామని ప్రకటించారు. నల్లచట్టాలు రద్దు అయ్యేవరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. యూపీ ఘటనపై ఇప్పటివరకు ప్రధాని మోదీ స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఏపీలో కరెంట్ కోతలు మొదలయ్యాయని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై జగన్ ప్రభుత్వం ఎందుకు నిజాలు చెప్పడం లేదు? అని రామకృష్ణ ప్రశ్నించారు.