ముఖ్యమంత్రికి రామకృష్ణ మ‌రో లేఖ

విధాత‌:ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. ఉద్యోగాలు ఇవ్వమని అడిగితే అరెస్టులు చేస్తారా?.గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతియేటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని యువతకు మీరు ఇచ్చిన హామీ ఏమైంది? 2.35 లక్షల ఉద్యోగ ఖాళీలుంటే రెండేళ్ల తదుపరి కేవలం 10,143 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయటం తగునా?కర్నూల్ లో యువజన, విద్యార్థులను అరెస్టు చేసి సెల్లో నిర్బంధించి, నాన్బెయిలబుల్ కేసులు పెట్టడం దుర్మార్గం.నిరుద్యోగులపట్ల మీకు చిత్తశుద్ధి […]

  • Publish Date - June 24, 2021 / 06:34 AM IST

విధాత‌:ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. ఉద్యోగాలు ఇవ్వమని అడిగితే అరెస్టులు చేస్తారా?.గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతియేటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని యువతకు మీరు ఇచ్చిన హామీ ఏమైంది? 2.35 లక్షల ఉద్యోగ ఖాళీలుంటే రెండేళ్ల తదుపరి కేవలం 10,143 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయటం తగునా?కర్నూల్ లో యువజన, విద్యార్థులను అరెస్టు చేసి సెల్లో నిర్బంధించి, నాన్బెయిలబుల్ కేసులు పెట్టడం దుర్మార్గం.నిరుద్యోగులపట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాల భర్తీకి నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి.కర్నూలు యువజన, విద్యార్థులపై పెట్టిన నాన్బెయిలబుల్ కేసులను ఉపసంహరించండి అంటూ లేఖ‌లో పేర్కొన్న‌ రామకృష్ణ.

Readmore:జగన్ కు ముద్రగడ లేఖ