విధాత:ఏపీఎస్ఆర్టీసీకి ఉన్న ఆసుపత్రులను కోవిడ్ ఆసుపత్రులుగా మార్పుచేసి ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందించండి.కరోనా రెండో విడతలో దాదాపు 12 వేల మంది ఆర్టీసీ సిబ్బందికి కరోనా సోకగా, 160 మంది మృత్యువాతపడ్డారు.
విజయవాడ, కడపలలో 50 పడకల సామర్థ్యంతో ఆర్టీసీకి ఉన్న ఆసుపత్రులను వినియోగంలోకి తీసుకురండి.ఈ హెచ్ ఎస్ కార్డులున్నప్పటికీ బయట ఆసుపత్రులలో బెడ్ లు లభించకపోవడంతో ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు.