విధాత:కోవిడ్ 19 వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు కృష్ణా జిల్లాలో మే 31 వరకు కర్ఫ్యూ పొడిగింపు ఉత్తర్వులు అమల్లో వుంటాయని జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ సంబందిత అధికారులకు మార్గదర్శకాలు జారీచేశారు.
టెస్ట్,ట్రీట్,టీకాలు వేయడం మరియు ప్రజల్లో కోవిడ్ మార్గదర్శకాలు పాటించేలా తగు ప్రవర్తనను ప్రోత్సహించడం పై దృష్టి సారించడం, కోవిడ్ 19 వ్యాప్తిని నియంత్రించాడనికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు.
ఇందులో భాగంగా మే 5 నుంచి 18 వరకు మధ్యాహ్నం 12.00 నుంచి ఉదయం 6 గంటల వరకు విధించిన కర్ఫ్యూ ,ఇతర ఆంక్షలను మే 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీచేసిన దృష్ట్యా జిల్లాలో పోలీస్,రైల్వే,ఎయిర్ పోర్ట్ ,అన్ని జిల్లా అధికారులు, మునిసిపల్ కమిషనర్లు,బ్యాంకర్లు, తహశీల్దార్లు,ఎంపిడివోలు మే 31 వరకు పొడిగించబడిన ప్రభుత్వ ఉత్తర్వుల్లో నిర్ధేశించిన ఆ0క్షలను,మార్గదర్శకాలు క్షేత్ర స్థాయిలో పటిష్ట వంతగా అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.