ఏపీ గవర్నర్ కు ఢిల్లీ పిలుపు?

విధాత:ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, రఘురామకృష్ణంరాజు వైసీపీకి మధ్య కొనసాగుతున్న వివాదం లాంటి అనేక అంశాల నేపథ్యంలో ఆయనకు ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది. కోవిడ్ నేపధ్యంలో గవర్నర్ ఈ మధ్య కాలంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లి చాలా రోజులు అయింది…. రెండు రోజుల క్రితమే జగన్ ఢిల్లీ వెళ్లి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ కు […]

  • Publish Date - June 15, 2021 / 10:47 AM IST

విధాత:ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, రఘురామకృష్ణంరాజు వైసీపీకి మధ్య కొనసాగుతున్న వివాదం లాంటి అనేక అంశాల నేపథ్యంలో ఆయనకు ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది.

కోవిడ్ నేపధ్యంలో గవర్నర్ ఈ మధ్య కాలంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లి చాలా రోజులు అయింది…. రెండు రోజుల క్రితమే జగన్ ఢిల్లీ వెళ్లి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ కు హస్తిన నుంచి పిలుపు రావడంతో… సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఢిల్లీ వెళ్లనున్న గవర్నర్ ప్రధాని మోడీతో సహా కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాలతో భేటీ అవుతారని విశ్వసనీయ సమాచారం…