విధాత:కొద్ది సేపటి క్రితం మాజీ మంత్రి, టిడిపి నేత దేవినేని ఉమకు ఏపి హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. గత నెల 28వ తేదీన జీకొండూరులో దేవినేని ఉమను అరెస్ట్ చేసారు. ఆయన పై కుట్ర కేసుతో పాటుగా, ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు, హ-త్యా-య-త్నం కేసు సహా, మొత్తం 18 కేసులు పెట్టి ఆయన్ను అరెస్ట్ చేసారు. ఈ నేపధ్యంలోనే కారు అద్దాలు పగలగొట్టి మరీ, జీకొండూరు పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి, కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని పెదపారుపూడి, ఆ తరువాత నందివాడ పోలీస్ స్టేషన్ లకు తరలించారు. ఆ తరువాత వెంటనే ఆయన్ను వెంటనే మైలవరం మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. హాజరు చేసిన వెంటనే, ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించారు. ప్రస్తుతం దేవినేని ఉమా, రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకుని వెళ్ళిన తరువాత, అక్కడ జైలు ఆఫీసర్ ని కూడా బదిలీ చేసారు. దీని ఫై కూడా దుమారం రేగి, చివరకు ఉమా భార్య చీఫ్ జస్టిస్ కు, గవర్నర్ కు కూడా లేఖలు రాసే దాకా వెళ్ళింది. ఈ నేపధ్యంలోనే హైకోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు. మంగళవారం ఈ బెయిల్ పిటీషన్ కు సంబంధించి, ఇరు పక్షాల వాదనా కూడా హైకోర్టు వింది.
దేవినేనికి బెయిల్ మంజూరు
<p>విధాత:కొద్ది సేపటి క్రితం మాజీ మంత్రి, టిడిపి నేత దేవినేని ఉమకు ఏపి హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. గత నెల 28వ తేదీన జీకొండూరులో దేవినేని ఉమను అరెస్ట్ చేసారు. ఆయన పై కుట్ర కేసుతో పాటుగా, ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు, హ-త్యా-య-త్నం కేసు సహా, మొత్తం 18 కేసులు పెట్టి ఆయన్ను అరెస్ట్ చేసారు. ఈ నేపధ్యంలోనే కారు అద్దాలు పగలగొట్టి మరీ, జీకొండూరు పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి, […]</p>
Latest News

కష్టాలను తల్చుకుని బాధపడుతున్నారా? ఈ వార్త చదివితే మీ దృక్కోణం మారిపోతుంది!
సనాతన ధర్మంలో "భూతశుద్ధి వివాహం" ఉందా?
ఇండిగో సంస్థకే ఎందుకీ కష్టాలు?
ప్రభుత్వాన్ని ఇండిగో ‘బ్లాక్మెయిల్’ చేసిందా?
గోదావరిలో తప్పిన ప్రమాదం...నది మధ్యలో ఆగిన బోటు
యాషెస్ రెండో టెస్టులో అస్ట్రేలియా ఘన విజయం
నేను చీటర్ ను కాదు : పెళ్లి రద్దుపై పలాశ్
ఔట్‌సోర్సింగ్‌పై సర్కార్ మడత పేచీ.. 4.95 లక్షల మంది ఉద్యోగులతో చెలగాటం!
భయపెడుతున్న మాజీ సర్పంచ్ ..గాలిలోకి నిమ్మకాయ వీడియో వైరల్
ఓర్నీ..మనిషిలా తొండ రెండుకాళ్లతో పరుగు..వైరల్ వీడియో