అమ్మవారిని దర్శించుకున్న డీజీపీ గౌతమ్ సవాంగ్

విధాత: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ దుర్గాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని డీజీపీ గౌతమ్ సవాంగ్ బుధవారం ఉదయం దర్శించుకున్నారు. డీజీపీకి అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం డీజీపీ వేద పండితుల చేత వేద ఆశీర్వచనం పొందారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ దసరా నవరాత్రులలో అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.  చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయని వాటిని భక్తులు  పెద్ద మనసుతో క్షమించాలని తెలిపారు. దసరా శరన్నవరాత్రిలో […]

  • Publish Date - October 13, 2021 / 07:55 AM IST

విధాత: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ దుర్గాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని డీజీపీ గౌతమ్ సవాంగ్ బుధవారం ఉదయం దర్శించుకున్నారు. డీజీపీకి అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం డీజీపీ వేద పండితుల చేత వేద ఆశీర్వచనం పొందారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ దసరా నవరాత్రులలో అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయని వాటిని భక్తులు పెద్ద మనసుతో క్షమించాలని తెలిపారు. దసరా శరన్నవరాత్రిలో పోలీసుల పాత్ర చాలా కీలకమైందని అన్నారు. విధి నిర్వహణ నిర్వహిస్తున్న పోలీసులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. దసరా నవరాత్రి ఉత్సవాలలో పోలీసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.