Site icon vidhaatha

జనసేన పోటీ స్థానాల్లో ఇతరులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించం.. హైకోర్టుకు ఈసీ వెల్లడి

విధాత : జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాల పరిధిలో, రెండు ఎంపీ స్థానాల పరిధిలో స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించబోమని ఎన్నికల సంఘం ఏపీ హైకోర్టుకు నివేదించింది. ఈ నిర్ణయంతో జనసేనకు ఇబ్బందులు తొలుగుతాయని అభిప్రాయపడింది. ఈసీ ఆదేశాలపై ఏవైనా అభ్యంతరాలుంటే మరో పిటిషన్ వేయవచ్చని కోర్టు సూచిస్తూ విచారణను ముగించింది. పిటిషన్‌ను డిస్పోజల్ చేసింది. తమ పార్టీ పోటీలో లేనిచోట్ల స్వతంత్రులకు ‘గాజు గ్లాసు’ గుర్తును కేటాయించొద్దంటూ హైకోర్టును జనసేన ఆశ్రయించింది. మంగళవారం దీనిపై విచారణ జరిగింది. 24 గంటల్లో ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం తరపు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ హైకోర్టుకు తెలిపారు. ఆ మేరకు నేడు ఈసీ నివేదిక అందజేశారు.

Exit mobile version