పేదల ఇళ్లు త్వరగా పూర్తిచేయండి: రఘురామ

విధాత,న్యూ ఢిల్లీ:ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని పేదలందరికీ త్వరితగతిన ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఏపీ సీఎం జగన్‌ను నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు. ఈ మేరకు ఆయన సీఎంకు ఎనిమిదో లేఖ రాశారు.ఆ లేఖలో వైఎస్‌ఆర్‌ జగనన్న హౌసింగ్‌ కాలనీలు,పేదలందరికీ ఇళ్ల అంశాన్ని ప్రస్తావించారు.‘‘పేదలందరికీ ఇళ్లు హామీతో ప్రజల నుంచి వైకాపాకు మద్దతు లభించింది. కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై కింద రాష్ట్రాలకు నిధులు ఇస్తోంది. గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే అదనంగా ఖర్చు చేస్తామని హామీ […]

  • Publish Date - June 17, 2021 / 07:06 AM IST

విధాత,న్యూ ఢిల్లీ:ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని పేదలందరికీ త్వరితగతిన ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఏపీ సీఎం జగన్‌ను నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు. ఈ మేరకు ఆయన సీఎంకు ఎనిమిదో లేఖ రాశారు.ఆ లేఖలో వైఎస్‌ఆర్‌ జగనన్న హౌసింగ్‌ కాలనీలు,పేదలందరికీ ఇళ్ల అంశాన్ని ప్రస్తావించారు.
‘‘పేదలందరికీ ఇళ్లు హామీతో ప్రజల నుంచి వైకాపాకు మద్దతు లభించింది. కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై కింద రాష్ట్రాలకు నిధులు ఇస్తోంది. గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే అదనంగా ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. జగనన్న కాలనీల్లో ఇంత వరకు మౌలిక సదుపాయాల కల్పన పూర్తికాలేదు. త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి’’ అని రఘురామ కోరారు.