బ్లాక్ ఫంగస్ సోకితే ఉచిత వైద్యం

విధాత:అమరావతి: బ్లాక్‌ ఫంగస్‌ సోకిన వారికి ఆరోగ్యశ్రీలో ఉచితంగా వైద్యం అందించనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు త్వరలో జీవో జారీ చేస్తామని ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. బ్లాక్‌ ఫంగస్‌ను మొదట్లోనే గుర్తిస్తే త్వరగా నయం చేయవచ్చన్నారు. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు ఇంజెక్షన్లను అందుబాటులో ఉంచుతామన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 9 మందికి బ్లాక్‌ ఫంగస్‌ సోకిందని, బాధితుల గురించి ప్రైవేటు ఆస్పత్రులు సమాచారమివ్వాలని సింఘాల్‌ కోరారు.

  • Publish Date - May 18, 2021 / 12:54 AM IST

విధాత:అమరావతి: బ్లాక్‌ ఫంగస్‌ సోకిన వారికి ఆరోగ్యశ్రీలో ఉచితంగా వైద్యం అందించనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు త్వరలో జీవో జారీ చేస్తామని ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. బ్లాక్‌ ఫంగస్‌ను మొదట్లోనే గుర్తిస్తే త్వరగా నయం చేయవచ్చన్నారు.

బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు ఇంజెక్షన్లను అందుబాటులో ఉంచుతామన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 9 మందికి బ్లాక్‌ ఫంగస్‌ సోకిందని, బాధితుల గురించి ప్రైవేటు ఆస్పత్రులు సమాచారమివ్వాలని సింఘాల్‌ కోరారు.