హిందువుల ఆచారాలు, ఆస్తులు, ఆలయాలపై ఏపీ సర్కారు దాడులు చేస్తోంది

విధాత‌,విజయనగరం:హిందువుల ఆచారాలు, ఆస్తులు, ఆలయాలపై ఏపీ సర్కారు దాడులు చేస్తోందని కేంద్ర మాజీ మంత్రివర్యులు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, శ్రీ పూసపాటి అశోకగజపతి రాజు అన్నారు. సింహాచలం‌లో జరిగిన అవమానం వ్యక్తిగతంగా తనకు జరిగిన నష్టం కాదని అధికారుల తీరు సరైనది కాదని చెప్పారు.జగన్ సర్కారుకు మంచి బుద్ది కలగాలని పైడి తల్లి అమ్మవారిని కోరుకున్నామ‌న్నారు, జైలికి వెళ్లొచ్చిన విజయసాయి రెడ్డి‌కి అందరు దొంగలుగానే కనపడతారన్నారు మాన్సస్‌లో తాను చేసిన అక్రమాలేమిటో ప్రభుత్వం బయట పెట్టాలని […]

  • Publish Date - June 21, 2021 / 05:40 AM IST

విధాత‌,విజయనగరం:హిందువుల ఆచారాలు, ఆస్తులు, ఆలయాలపై ఏపీ సర్కారు దాడులు చేస్తోందని కేంద్ర మాజీ మంత్రివర్యులు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, శ్రీ పూసపాటి అశోకగజపతి రాజు అన్నారు.

సింహాచలం‌లో జరిగిన అవమానం వ్యక్తిగతంగా తనకు జరిగిన నష్టం కాదని అధికారుల తీరు సరైనది కాదని చెప్పారు.జగన్ సర్కారుకు మంచి బుద్ది కలగాలని పైడి తల్లి అమ్మవారిని కోరుకున్నామ‌న్నారు, జైలికి వెళ్లొచ్చిన విజయసాయి రెడ్డి‌కి అందరు దొంగలుగానే కనపడతారన్నారు మాన్సస్‌లో తాను చేసిన అక్రమాలేమిటో ప్రభుత్వం బయట పెట్టాలని డిమాండ్ చేశారు. తాను తప్పు చేస్తే కనీసం నోటీసులు కూడా ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా సింహాచలం ఈవో ఇప్పటివరకు తనని కలవలేదని.సంచయితకు ఇక్కడ ఎన్ని హక్కులు వున్నాయో చెప్పటానికి సోషల్ మీడియోలో ఆమె పెట్టిన పోస్టులు చాలని అశోక్ గజపతిరాజు ఎద్దేవా చేశారు.

Readmore:అశోక్‌గజపతిరాజు జైలుకెళ్లడం తప్పదు: విజయసాయిరెడ్డి