Site icon vidhaatha

ముఖ్యమంత్రిని కలిసిన గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా

విధాత‌: గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసారు. సిసోడియా ఇటీవల గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న నేపధ్యంలో తాడేపల్లి సిఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిసారు. కరోనా నేపధ్యంలో రాజ్ భవన్ ను సురక్షితంగా ఉంచేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని ఈ సందర్భంగా సిసోడియాకు ముఖ్యమంత్రి సూచించారు. గవర్నర్ ఆరోగ్య పరిరక్షణ విషయంలో నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.

Exit mobile version