“కారా” మాస్టారు మృతి పట్ల గవర్నర్ సంతాపం

విధాతవిజయవాడ, జూన్ 04: ప్రముఖ తెలుగు కథా రచయిత, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ కాళిపట్నం రామారావు మృతి పట్ల శ్రీయుత గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ సంతాపం వ్యక్తం చేశారు. కా.రా మాస్టరుగా పేరొందిన కాళిపట్నం రామారావు శ్రీకాకుళంలో శుక్రవారం కన్నుమూయగా గవర్నర్ విచారం వెలిబుచ్చారు. గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ దివంగత శ్రీ కాళిపట్నం రామారావు తెలుగులో చిన్న కథల రచయితగా ప్రసిద్ది చెందటమే కాక, ఆయన ప్రతిభకు కొలమానంగా అనేక విశ్వవిద్యాలయాలు […]

  • Publish Date - June 4, 2021 / 09:53 AM IST

విధాతవిజయవాడ, జూన్ 04: ప్రముఖ తెలుగు కథా రచయిత, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ కాళిపట్నం రామారావు మృతి పట్ల శ్రీయుత గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ సంతాపం వ్యక్తం చేశారు. కా.రా మాస్టరుగా పేరొందిన కాళిపట్నం రామారావు శ్రీకాకుళంలో శుక్రవారం కన్నుమూయగా గవర్నర్ విచారం వెలిబుచ్చారు.

గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ దివంగత శ్రీ కాళిపట్నం రామారావు తెలుగులో చిన్న కథల రచయితగా ప్రసిద్ది చెందటమే కాక, ఆయన ప్రతిభకు కొలమానంగా అనేక విశ్వవిద్యాలయాలు గౌరవ డిగ్రీలను ప్రదానం చేసాయని ప్రస్తుతించారు. దివంగత “కారా” కుటుంబ సభ్యులకు గవర్నర్ శ్రీ హరిచందన్ సంతాపం తెలిపారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.