విధాత, హైదరాబాద్ : ఆయనొక సర్కార్ పెద్దాసుపత్రి సూపరిండెంట్. తన ఆసుపత్రి సిబ్బంది పనితీరును తెలుసుకునేందుకు మారు వేషం కట్టాడు. అకస్మాత్తుగా పేద వృద్దుడి అవతారం ధరించాడు. రాత్రివేళ వైద్యం కోసం ఇద్దరు సహాయకులతో కలిసి తను సూపరిండెంట్ గా ఉన్న గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రికి వెళ్లాడు. చెరిగిన జుట్టు, చేతికర్ర, పంచెకట్టు, మాస్క్‌తో వచ్చిన వృద్ధుడిని పరీక్షించిన వైద్య సిబ్బంది ఆయనకు అవసరమైన పరీక్షలు రాశారు. ల్యాబ్ సిబ్బంది శాంపీల్స్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆసుపత్రి సిబ్బంది ఆ వృద్దుడి పట్ల ఎలా వ్యవహరించారన్నది ఆసక్తికరంగా మారింది. ఇదంతా తన పర్యవేక్షణలో ఉన్న గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రి సిబ్బంది పనితీరును తనిఖీ చేసేందుకు సూపరింటెండెంట్ యశస్వి రమణ పోషించిన వృద్ద రోగి పాత్ర ఎపిసోడ్ కథ.
ఆసుపత్రిలో రాత్రివేళల్లో ఆర్ఎంవోలు, వైద్యులు ఉండటం లేదన్న ఆరోపణల నేపథ్యంలో సూరిండెంట్ స్వయంగా ఆసుపత్రిని మారు వేషంలో తనిఖీ చేశారు. వృద్దుడి వేషం కట్టి..లుంగి ధరించి ఆసుప్రతి అంతా గంటపాటు తిరిగి..అన్ని విభాగాల పనతీరును స్వయంగా పరిశీలించారు. సిబ్బంది సమాధానాలను విన్నారు. మారువేషంలో ఉన్న తమ సూపరిండెంట్ ను ఆసుప్రతి సిబ్బంది ఎవరూ గుర్తు పట్టకపోవడంతో ఆయన తనిఖీ ప్రయత్నం విజయవంతమైంది.
తన మారువేషం తనిఖీ ఎపిసోడ్ అనుభవాలను సూపరిండెంట్ యశస్వి రమణ మీడియాకు వెల్లడించారు. తనిఖీ ఎపిసోడ్ లో తాను కొన్ని సమస్యలు గుర్తించినని, వెంటనే వాటి పరిష్కారానికి ఆదేశాలిచ్చానని స యశస్విరమణ తెలిపారు. కొందరు సిబ్బంది వృద్ద రోగి పట్ల విసుగును ప్రదర్శించారని..అలాంటివి చేయకుండా ఉండాలని సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేశామని వెల్లడించారు. సూపరిండెంట్ చర్యను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇలాగే ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారులు తనిఖీలు చేస్తే పేదలకు మరింత మంచి వైద్యం అందే అవకాశం ఉందని అభిప్రాయ పడుతున్నారు.
గుంటూరు జీజీహెచ్‌లో సూపరింటెండెంట్ వేషం మార్చి ఆకస్మిక తనిఖీలు రాత్రివేళ వృద్ధుడి వేషంలో ఇద్దరు సహాయకులతో కలిసి గుంటూరు జీజీహెచ్‌కు వచ్చిన సూపరింటెండెంట్ రమణ యశస్వి చెరిగిన జుట్టు, చేతికర్ర, పంచెకట్టు, మాస్క్‌తో వచ్చి ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పనితీరును పర్యవేక్షించారు. pic.twitter.com/Va5UnekN7T
— Tolivelugu Official (@Tolivelugu) November 27, 2025
