Site icon vidhaatha

Nizamabad: ‘ప్రేమతో వైద్యం’.. ప్ర‌భుత్వాసుప‌త్రిలో 119 అడుగుల సందేశాత్మ‌క చిత్రం

విధాత‌: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రజలకు ప్రభుత్వ వైద్యం మరింత
చేరువయ్యే విధంగా ప్రేమతో వైద్యం అనే వినూత్న ఆలోచనతో ముందుకెళ్తున్నారు అధికారులు.

ఆసుపత్రి అనగానే ఆందోళన చెందకుండా ఆనందంగా వైద్యం చేయించుకోవచ్చని, వైద్యులు ప్రేమతో స్నేహ పూర్వకమైన వైద్యాన్ని అందిస్తారనే సందేశాత్మక చిత్రాన్ని నిజామాబాద్ గవర్న‌మెంట్ జ‌నరల్ హాస్పిటల్ గోడపై వేయించారు.

119 అడుగుల ఎత్తులో వేసిన ఈ చిత్రం దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన చిత్రం కావడం విశేషం. చిన్న పిల్లలకు వాక్సినేషన్ సమయానికి అందించడానికి గుర్తుగా ఈ చిత్రం ఉందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version