Site icon vidhaatha

విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి జగన్‌


విధాత : కంటాకపల్లి రైలు ప్రమాదంలో గాయపడి విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఏపీ సీఎం వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి సోమవారం పరామార్శించారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే 15మంది చనిపోగా, మరో 50మందికి పైగా తీవ్ర గాయలపాలయ్యారు.

విజయనగరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సీఎం జగన్ పరామర్శించారు. మృతుల కుటుంబాలను ఓదార్చారు. రైలు ప్రమాద బాధిత కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరుపునా అందించాల్సిన తక్షణ సహయంతో పాటు ఎక్స్‌గ్రేషియా మొత్తాలను వెంటనే చెల్లించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

Exit mobile version