కాపు రిజర్వేషన్ల సాధన కోసం పోస్ట్ కార్డ్ ఉద్యమం

విధాత‌: కాపు రిజర్వేషన్ల సాధన కోసం పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు కాపు సంక్షేమ సేన అధ్యక్షులు హరిరామ జోగయ్య తెలిపారు. ఇంటికి ఒక్కరు నియోజకవర్గానికి వెయ్యి మంది చొప్పున ముఖ్యమంత్రికి కాపు రిజర్వేషన్లపై లేఖలు రాసి ఒత్తిడి పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందడం కాపు తెలగ బలిజ ఒంటరి కులస్తుల హక్కన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం తమరు రిజర్వేషన్లు కల్పించకపోతే తమ సర్కారు మరోసారి అధికార దక్కించుకోవడం కల్ల అంటూ […]

  • Publish Date - October 11, 2021 / 06:10 AM IST

విధాత‌: కాపు రిజర్వేషన్ల సాధన కోసం పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు కాపు సంక్షేమ సేన అధ్యక్షులు హరిరామ జోగయ్య తెలిపారు. ఇంటికి ఒక్కరు నియోజకవర్గానికి వెయ్యి మంది చొప్పున ముఖ్యమంత్రికి కాపు రిజర్వేషన్లపై లేఖలు రాసి ఒత్తిడి పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందడం కాపు తెలగ బలిజ ఒంటరి కులస్తుల హక్కన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం తమరు రిజర్వేషన్లు కల్పించకపోతే తమ సర్కారు మరోసారి అధికార దక్కించుకోవడం కల్ల అంటూ లేఖలు రాయాలని నిర్ణయించినట్లు హరిరామ జోగయ్య వెల్లడించారు.